ఆరు రాష్ట్రాల్లో ఏడు అసెంబ్లీ
నియోజకవర్గాలకు జరిగిన ఉపయెన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరిగింది. ఆ ఫలితాల వివరాలు
ఇలా ఉన్నాయి…
త్రిపుర, ధనపూర్: భారతీయ జనతా పార్టీ
అభ్యర్ధి బిందు దేబనాథ్ విజయం సాధించారు. ఇక్కడ గతంలోనూ బీజేపీయే గెలిచింది.
త్రిపుర, బోక్సానగర్: భారతీయ జనతా
పార్టీకి చెందిన తఫజ్జల్ హుసేన్ విజయం సాధించారు. గతంలో సీపీఎం ఖాతాలో ఉన్న ఈ నియోజకవర్గం
ఇప్పుడు బీజేపీ చేతికి వచ్చింది.
పశ్చిమ బంగ, ధూప్గురి: తృణమూల్
కాంగ్రెస్ అభ్యర్ధి నిర్మల్ చంద్ర రాయ్ గెలిచారు. ఈ స్థానం గతంలో బీజేపీ ఖాతాలో
ఉంది.
ఉత్తరప్రదేశ్, ఘోసీ: సమాజ్వాదీ
పార్టీ అభ్యర్ధి సుధాకర్ సింగ్ గెలుపు దక్కించుకున్నారు. ఈ స్థానం గతంలోనూ ఎస్పీదే.
ఉత్తరాఖండ్, బాగేశ్వర్: భారతీయ జనతా
పార్టీ అభ్యర్ధి పార్వతీ దాస్ విజయం సాధించారు. ఇక్కడ గతంలోనూ బీజేపీయే గెలిచింది.
జార్ఖండ్, దుమ్రీ: జార్ఖండ్ ముక్తి
మోర్చాకు చెందిన బేబీ దేవి గెలిచారు. గతంలోనూ ఇక్కడ జేఎంఎం పార్టీయే గెలిచింది.
కేరళ, పుత్తుపల్లి: కాంగ్రెస్ నాయకుడు
చాందీ ఊమెన్ గెలిచారు. గతంలోనూ ఇక్కడ కాంగ్రెసే గెలిచింది.