జీ-20
శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రపంచదేశాల అధినేతలు,
అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాక సందర్భంగా సందడి వాతావరణం చోటుచేసుకుంది.
జీ-20
కూటమిలోని 20 దేశాధినేతలు, 11 ఆహ్వాన దేశాలు, ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి,
ఐఎంఎఫ్ వంటి సంస్థల అధినేతలు సదస్సుకు హాజరవుతున్నారు. దీంతో గట్టి భద్రత
కల్పిస్తున్నారు. ఐదువేల సీసీ కెమెరాలతో భద్రతను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
అమెరికా
అధ్యక్షుడు జో బైడెన్ భారత్ కు బయలుదేరగా, కాసపట్లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దిల్లీలో
అడుగుపెట్టనున్నారు. ఆయన షాంగ్రిలా హోటల్‌లో బస చేయనున్నారు. ఈ భారత సంతతి నేత
యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్ కు రావడం ఇదే తొలిసారి.
కేంద్రమంత్రి
అశ్వని చౌబే స్వాగతం పలుకుతారు. సునాక్ బంధువులు కూడా ఆహ్వానం పలికేందుకు దిల్లీ
చేరుకున్నారు. ఇవాళరాత్రి ఏడుగంటలకు బైడెన్ దిల్లీలో అడుగుపెడతారు. ఆయనకు ఐటీసీ మౌర్యలో ఆతిథ్యం
కల్పిస్తున్నారు.
అంతర్జాతీయ
ఆర్థిక సహకారం కోసం జరుగుతున్న కీలక జీ-20 సదస్సులో అమెరికన్ల ప్రయోజనాలు,
అభివృద్ధి చెందుతున్న దేశాల పురోగతిపై దృష్టిసారిస్తామని ఆయన పర్యటన బయలుదేరేముందు
తెలిపారు.
జపాన్ ప్రధాని పుమియో కిషిదా, బంగ్లాదేశ్ ప్రధాని
షేక్ హసీనా కూడా మధ్యాహ్నానికి భారత్ చేరుకోనున్నారు. ఇప్పటికే అర్జెంటీనా అధ్యక్షుడు
అల్బర్టో ఫెర్నాండెజ్ దిల్లీ చేరుకున్నారు.
స్పెయిన్
అధ్యక్షుడు పెడ్రో శాంచెజ్ కరోనా బారినపడ్డారు. దీంతో ఆయన స్థానంలో ఉపాధ్యక్షురాలు
నడియా కాల్వినో, విదేశాంగ మంత్రి జోస్ మాన్యూల్ అబ్బరీస్ హాజరవ్వనున్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు పెంచడం, భౌగోళిక
రాజకీయ అనిశ్చితి ప్రభావం, అంతర్జాతీయ రుణ నిర్వహణను సరళీకరించడంపై చర్చించనున్నారు.
వీటితో పాటు గ్రీన్ డెవలప్‌మెంట్, వాతావరణ మార్పులు, వ్యవసాయం-ఆర్థిక వ్యవస్థ,
సాంకేతిక మార్పులు, సాధికారతతో అభివృద్ధి వంటి అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.
సంక్షోభం నుంచి గట్టెక్కించండి : 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌తో సీఎం చంద్రబాబు భేటీ