సౌరమండలంపై పరిశోధనకు గాను ఇస్రో ప్రయోగించిన
ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహం అప్పుడే పనిచేయడం
ప్రారంభించింది. ప్రయాణంలో భాగంగా సెల్ఫీ తీసుకున్న ఆదిత్య ఎల్-1, భూమి,
చంద్రుడుని ఒకే ఫ్రేమ్ లో క్లిక్ మనిపించింది.
భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ -1
దిశగా ప్రయాణిస్తున్న ఆదిత్య ఎల్-1 గమ్యాన్ని చేరేందుకు ఇంకా నాలుగు నెలలు పాటు
ప్రయాణం కొనసాగించాల్సి ఉంది.
మొదటి 16
రోజుల పాటు భూ కక్ష్యలోని తిరుగుతుంది. అలా తిరుగుతూనే సెల్ఫీ తీసుకుంది. అలా
తిరుగుతూనే భూమి, చంద్రుడిని తన కెమెరాలో బంధించింది. స్టెప్టెంబర్ 4న భూమి,
చంద్రుడు కక్ష్యలో ఉన్న సమయంలో ఈ అద్భుత దృశ్యాన్ని ఫొటో తీసి ఇస్రోకు చేరవేసింది.
ఆదిత్య ఎల్ 1 లోని విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనా
గ్రాఫ్, సూర్యూడి కరోనా, స్పెక్ట్రోస్కోపీని అధ్యయనం చేయనుంది. సెప్టెంబర్ 2న
శ్రీహరికోట నుంచి నింగికి ఎగిసిన ఈ ఉపగ్రహం, ఇటీవలే రెండోసారి భూకక్ష్య పెంపు
విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టారు. 280కిలోమీటర్లుx40,225కిలోమీటర్ల
కక్ష్యలోకి ప్రవేశించింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాశాన్ని సెప్టెంబర్ 10 న
నిర్వహిస్తారు.
ఆదిత్య ఎల్ 1 లో ఏడు రకాల పరిశోధన పరికరాలు
ఉన్నాయి. ఇవి సూర్యుడి పొరలైన ఫొటోస్పియర్, క్రోమోస్పియర్ సహా వెలుపల ఉండే కరోనాను
అధ్యయనం చేసే వీలుంది. సౌరజ్వాలలు, రేణువులు, అక్కడి వాతావరణం గురించి కీలక
సమాచారాన్ని ఇస్రోకు చేరవేస్తాయి.