దేశాల
పేర్లు మార్పుపై ఐక్యరాజ్యసమితి సానుకూలంగా స్పందించింది. దేశాల పేర్లను మార్చాలని
వచ్చిన అభ్యర్థనలను ఐక్యరాజ్యసమితి పరిగణనలోకి తీసుకుంటుంది. పేరు
మార్పుపై దేశాల నుంచి వచ్చే అభ్యర్థన ఆధారంగానే తమ నిర్ణయం ఉంటుందని పేర్కొంది.
జీ-20 సమావేశాల
సందర్భంగా అధికారిక ఆహ్వానపత్రాల్లో ఇండియాకు బదులు భారత్ అని అచ్చువేయడంపై
స్పందించిన ఐరాస సెక్రటరీ జనరల్ ఉప అధికార ప్రతినిధి ఆంటోనియో గుటెరస్ పర్హాన్
హక్, టర్కీ పేరు మార్పును ఉదహరించారు.
టర్కీకి బదులు తుర్కియో
అని ఆ దేశ ప్రభుత్వం పంపిన అధికారిక
అభ్యర్థనను మేం స్వీకరించి సానుకూలంగా స్పందించామని తెలిపింది. అలాగే మిగతా దేశాల
నుంచి వచ్చే అభ్యర్థనలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
దిల్లీ వేదికగా
సెప్టెంబర్9,10 తేదీల్లో జరిగే జీ-20 సదస్సు సందర్భంగా విదేశీ అతిథుల కోసం
ముద్రించిన పలు పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్
అని అచ్చు వేశారు. అలాగే అతిథులకు పంపిణీ చేసే పుస్తకాల్లో కూడా ఇండియా బదులు
భారత్ అనే ముద్రించారు. ప్రధాని మోదీని కూడా ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్ అని
ప్రస్తావించారు. దీంతో ఇండియా బదులు ఆంగ్లంలోనూ భారత్ అని స్థిరీకరించేందుకు
కేంద్రం చర్యలు చేపట్టింది.
ప్రధాని మోదీ
అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గం సమావేశంలోనూ భారత్ పేరు పై చర్చ జరిగింది. ఈ
విషయంపై సహచరులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని, భారత్ పేరు మార్పు పై రాజకీయ వివాదం
రేగకుండా ఆచితూచి స్పందించాలని సూచించారు. భారత్ అనేది దేశం యొక్క ప్రాచీనపేరు అనే
విషయాన్ని గుర్తుచేయాలన్నారు. అనవసర
వివాదం రేగకుండా జాగ్రత్త పడాలని చెప్పినట్లు సమాచారం.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు