కోవిడ్ తరవాత పరిస్థితులనుబట్టి, ప్రపంచ పురోగతిక్రమాన్ని నిర్మించాలని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. ప్రపంచంలో గ్లోబల్ సౌత్ వాదాన్ని బలోపేతం చేయాలని ఆయన ఆసియాన్ దేశాలను కోరారు. ఇండో పసిఫిక్ దేశాల మధ్య వాణిజ్యానికి మరింత స్వేచ్ఛ ఇవ్వాలని ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరిగిన ఆసియాన్ ఇండియా సమావేశాల్లో ప్రధాని మోదీ కోరారు.
ఆగ్నేయాసియా దేశాల సంఘం…. ఆసియాన్ అత్యంత ప్రభావం చూపే యూనియన్‌గా ఉంది. భారత్, చైనా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా సహా పలు దేశాలు ఇందులో చర్చకు అనుమతి ఉన్న సభ్యులుగా ఉన్నాయి. ఇండో పసిఫిక్ దృక్పధానికి భారత్ మద్దతు ఇస్తుందని ఆసియాన్ గ్రూపు నేతలతో ప్రధాని మోదీ చెప్పారు.
ఈ శతాబ్ధం మనదే..
21వ శతాబ్దం ఆసియాదేనని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ తరవాత అభివృద్ధి చేయడం, ప్రజల సంక్షేమం కోసం చేసే అభివృద్ధి ప్రయత్నాలు మనందరికీ పరస్పరం ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. ప్రపంచ దేశాల వృద్ధిలో అనిశ్చితి ఉన్నా, పరస్పర సహకారంతో స్థిరమైన పురోగతి సాధ్యం అవుతుందన్నారు. భారత యాక్ట్ ఈస్ట్ విధానానికి ఆసియాన్ కేంద్ర స్తంభమని ప్రధాని మోదీ అన్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు