సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం, రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రత్యేక కోటా కోసం మరాఠీల
ఆందోళన కొనసాగుతున్న సమయంలో భాగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అసమానత్వం అనే రుగ్మతను నయంచేసేందుకు అవసరమైన ప్రక్రియల్లో
రిజర్వేషన్లు కూడా ఒకటి అన్నారు. రాజ్యాంగం కల్పిస్తున్న అన్ని రిజర్వేషన్ల అమలుకు
ఆర్ఎస్ఎస్ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.
సామాజికవ్యవస్థలో 2000 ఏళ్ళుగా
కొనసాగుతున్న అసమానత్వాన్ని ఇంకా రూపమాపలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
సమాజంలో పైకి కనబడని వివక్ష కొనసాగుతుందన్న మోహన్ భాగవత్.. రిజర్వేషన్లు అనేవి
ఆర్థిక సాయం, రాజకీయం సమానత్వం కాదని, అవి వారికి(బాధితులకు) అందించే గౌరవం అని
అభివర్ణించారు.
రెండు వేల సంవత్సరాలుగా వివక్ష ఎదుర్కొంటున్నవారి కోసం అమలు చేస్తున్న
రిజర్వేషన్లతో కొద్దిమందికి ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ అంగీకరించాల్సిందేనన్నారు.
అఖండ భారత్ ఆవిర్భావం పై కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
చేశారు. అఖండ భారత్ కల ఎప్పుడో
నెరవేరుతుందో ఖచ్చితమైన సమయం చెప్పలేనప్పటికీ అది సార్థకం కావడం ఖాయమన్నారు.
ఓ
విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మోహన్ భాగవత్, ఓ సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తూ
వెళితే సాకారం అవుతుందన్నారు. ఇప్పటి నుంచి ప్రణాళిక మేరకు శ్రమిస్తే సదరు
విద్యార్థి, వృద్ధాప్య దశకు వచ్చే నాటికి వాస్తవరూపం దాలుస్తుందని వివరించారు.
దేశ విభజన అతిపెద్ద తప్పు అని 1947 లోమన భూభాగం నుంచి వేరుపడిన వారు అంగీకరిస్తున్నారన్న
మోహన్ భాగవత్, విభజన రేఖలు చెరిగిపోవాలని కోరుకుంటున్నారని తెలిపారు.
త్రివర్ణ పతాకాన్ని
గౌరవించడంతో దేశం కోసం ప్రాణం త్యాగం
చేసేందుకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు.