ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకులో కొలువుల జాతరమొదలైంది. డిగ్రీ పాసై ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఎస్‌బీఐ తీపి కబురు అందించింది. కొద్ది రోజుల కిందటే 6100 అప్రెంటీస్ ఖాళీల
భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన ఎస్‌బీఐ, తాజాగా 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులు, ఆసక్తి కలిగిన వారు సెప్టెంబరు 7 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్‌బీఐ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులున్నాయి. వీటిలో ఎస్సీ 300, ఎస్టీ 150, ఓబీసీ 540, ఈడబ్య్లూఎస్ 200, యూఆర్ 810 ఖాళీలు ఉన్నాయి. ఎంపికైన వారికి బేసిక్ రూ.41960 చెల్లిస్తారు. అభ్యర్థుల వయసు 21 పూర్తియి ఉండాలి. అదేవిధంగా 30 ఏళ్లు దాటగూడదు.
పీవో ఉద్యోగాల భర్తీ మూడు దశల్లో జరుగుతుంది. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష, తరవాత మెయిన్ పరీక్ష, సైకో మెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్, చివరగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. జనరల్, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు నాలుగు సార్లు ఈ పరీక్షలు రాయవచ్చు. మిగిలిన కేటగిరీలకు చెందిన వారు ఏడు సార్లు ఈ పరీక్షలకు హాజరుకావచ్చు.