తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఏటీఎంల దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఏటీఎం దొంగతనాలపై నిఘా పెట్టిన పోలీసులు రాజస్థాన్‌కు చెందిన ముఠాను అరెస్టు చేశారు. ఏటీఎం దొంగల గురించి పోలీసులు షాకింగ్ నిజాలు చెప్పారు. విమానాల్లో వచ్చి మరీ ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లా డీగ్ ప్రాంతానికి చెందిన జుబేర్, లుక్మాన్ డీన్, సద్దాం, ముస్తాక్, ఇద్రిక్‌లు ఏడేళ్లగా తెలంగాణ, ఏపీలో ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఏటీఎం దొంగతనాల ద్వారా కోట్లు కొల్లగొట్టారని పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల భద్రాద్రి అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఏటీఎంలో చోరీ జరిగింది. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పోలీసులు నిఘా పెట్టారు. మేవాఠ్‌కు చెందిన గ్యాంగు ఈ దోపిడీకి పాల్పడినట్టు గుర్తించారు.
ఈ ముఠా సభ్యులు రాజస్థాన్‌లోని భరత్‌పూర్, అల్వార్ ప్రాంతాలకు చెందిన వారి ఏటీఎం కార్డులు తీసుకుని ఎవరికీ అనుమానం రాకుండా తెలుగు రాష్ట్రాలకు విమానాల్లో వాలిపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంల వద్ద చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. ముందుగా ఇద్దరు చొప్పున జట్టుగా ఏర్పడతారు. ఏటీఎంలో డబ్బు తీసే సమయంలో, ఏటీఎంకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తారు. దీని వల్ల డబ్బు అయితే వస్తుంది. కానీ సదరు ఖాతాదారుడి బ్యాంకు ఖాతా నుంచి మాత్రం డబ్బు విత్ డ్రా కాదు. ఇలా తీసిన డబ్బును ఏటీఎం కార్డు ఇచ్చిన వారికి కొంత ఇచ్చి, మిగిలిన సొమ్ము ముఠా సభ్యులు పంచుకుంటున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
తెలంగాణలో ఏటీఎంలలో దొంగతనాలు చేసి హైదరాబాద్ నుంచి జైపూర్ విమానం ఎక్కినట్టు తెలుసుకున్న పోలీసులు, రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించారు. ముఠా సభ్యులు జైపూర్ ఎయిర్‌పోర్టులో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హైదరాబాద్ పోలీసులు తెలిపారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు