తిరుమల
నడకదారిలో చిరుతల సంచారం నేపథ్యంలో పాలకమండలి రక్షణ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆపరేషన్ చిరుత కొనసాగుతుండగా క్రూరమృగాల
నుంచి రక్షణ కోసం చేతికర్రలను అందుబాటులోకి తెచ్చింది. అలిపిరి మెట్ల మార్గం వద్ద
చేతి కర్రల పంపిణీ కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో
ధర్మారెడ్డి ప్రారంభించారు.
చేతికర్ర
ఉంటే జంతువులు దగ్గరకు రావనే శాస్త్రీయ వాదన ఉందన్న భూమన కరుణాకర్ రెడ్డి, నడిచి
వెళ్ళే భక్తులకు ఆత్మ విశ్వాసం పెరుగుతోందన్నారు. చేతికర్ర ఒక్కటే ఇచ్చి మా
పనిఅయిపోయింది అనుకోవడం లేదని చెప్పారు. భక్తుల రక్షణకు అవసరమైన అన్ని చర్యలు
తీసుకుంటున్నామన్నారు.
అలిపిరి
మెట్లమార్గంలో ప్రస్తుతం పదివేల కర్రలు భక్తులకు అందుబాటులోకి తెచ్చినట్లు టీటీడీ
ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మరో పదివేల కర్రలు అందుబాటులోకి తెస్తామన్నారు.
వీటికోసం రూ. 45 వేలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల రక్షణ చర్యల్లో
భాగంగానే చేతి కర్రలు అందిస్తున్నామన్నారు.
పూర్వం
నుంచి రైతులు చేతికర్రలు వినియోగిస్తూనే
ఉన్నారని తెలిపారు. భక్తులకు అలిపిరి మెట్ల మార్గంలో ఇచ్చిన చేతికర్రను ఏడో మైలు
నరసింహస్వామి ఆలయం వద్ద తిరిగి స్వాధీనం చేసుకుంటామని ధర్మారెడ్డి చెప్పారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు