సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపధ్యంలో ప్రధాని మోదీ తొలిసారి స్పందించారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సరైన స్పందన రావాలని ఆశిస్తున్నట్టు మోదీ చెప్పారు. నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పిలవకపోవడం, సనాతన ధర్మం పాటించేవారి వివక్షకు ఒక ఉదాహరణ అంటూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల తరవాత ప్రధాని మోదీ స్పందించారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా దోమలతో పోల్చి వాటిని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు.
తనపైన ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకున్నా వాటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నట్టు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పలుమార్లు చెప్పారు. ఉదయనిధిపై చట్టపరమైన చర్యలకు తమిళనాడు గవర్నర్ అనుమతి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తల నేపధ్యంలో, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దమని ఉదయనిధి స్టాలిన్ చెప్పడం గమనార్హం.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇండియా కూటమిలోని పక్షాలు స్టాలిన్ వ్యాఖ్యలను సమర్థించుకున్నాయి. అన్ని మతాలను గౌరవించాలని, అభిప్రాయాలు చెప్పే హక్కు ప్రజలకు ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేతలు వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే, కార్తీ చిదంబరం, మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. సీపీఎం నేత డి.రాజా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉదయనిధి స్టాలిన్‌కు అండగా నిలిచారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు