ఒకవైపు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ డీఎంకే
నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే, అమెరికాలోని ఒక నగరం సనాతన ధర్మానికి
గుర్తింపుగా ఒక రోజును కేటాయించింది.
అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లూయీస్విల్లే నగర
మేయర్ సెప్టెంబర్ 3ను సనాతన ధర్మ దినంగా ప్రకటించారు. నగరంలోని హిందూ ఆలయంలో
మహాకుంభాభిషేక మహోత్సవం జరిగిన సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నగర మేయర్
క్రెగ్ గ్రీన్బెర్గ్ తీసుకున్న అధికారిక నిర్ణయాన్ని ఆయన తరఫున డిప్యూటీ మేయర్
బార్బరా సెక్స్టన్ చదివి, అధికారికంగా ప్రకటించారు.
ఆ కార్యక్రమంలో పలువురు భారతీయ ఆధ్యాత్మిక
గురువులు పాల్గొన్నారు. రిషీకేష్లోని పరమార్థ నికేతన్ అధ్యక్షులు చిదానంద సరస్వతి,
శ్రీశ్రీ రవిశంకర్, ఇతర ఆధ్యాత్మిక గురువులు, లూయీస్విల్లే డిప్యూటీ చీఫ్ ఆఫ్
స్టాఫ్ కెయిషా డోర్సే తదితరులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వదేశంలో సనాతన ధర్మం అంటే
గిట్టని ప్రచ్ఛన్న క్రైస్తవ పార్టీ డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, ఓటుబ్యాంకు
రాజకీయాల కోసం హిందూ ధర్మాన్ని అడుగడుగునా దెబ్బతీయడానికి ఎంతమాత్రం వెనుకాడని
కాంగ్రెస్ పార్టీ నాయకులు సనాతన ధర్మాన్ని నిందిస్తూ, తూలనాడుతూ వ్యాఖ్యలు
చేస్తున్న తరుణంలోనే అమెరికన్ నగరం సనాతన ధర్మాన్ని గౌరవించుకోవడం ఆసక్తికరం.