సత్యం పునాదులపై నిలబడిన దేశ సంస్కృతిని నాశనం చేసేందుకు కొంతమంది
ప్రయత్నిస్తున్నారని రాష్ట్రీయ స్వయం
సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు.
నాగపూర్
లో నిర్వహించిన వృద్ధుల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన మోహన్ భాగవత్, ప్రపంచ వ్యాప్తంగా కుటుంబవ్యవస్థ కనుమరుగవుతోందని,
భారత్ మాత్రం ఈ విపత్తు నుంచి తప్పించుకోగల్గిందన్నారు.
మనదేశం సత్యం అనే పునాది
నిలబడటమే అందుకు కారణమని వివరించారు.
స్వార్థపూరిత
మనస్కులు ప్రాపంచిక సుఖాలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. అందుకోసం పరిస్థితులను
వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాంస్కృతిక
మార్క్సిజం పేరిట తమ సిద్ధాంతాలను సమర్థించుకుంటున్నారన్నారు. దాని ప్రభావం అన్ని
దేశాలపై ఉన్నప్పటికీ మనదేశం బయటపడిందన్నారు. మన సంస్కృతి మూలాలు దృఢమైనవి
కావడంతోనే ఇది సాధ్యమైందన్నారు.
ఇండియా అని పిలవడానికి బదులు భారత్ అనే పలకాలని గత
నెలలో మోహన్ భాగవత్ కోరారు. ప్రస్తుతం కేంద్రం ఆదిశగా అడుగులు వేస్తోంది. దీనిపై
ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తిని
దెబ్బతీసేలా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని విమర్శిస్తున్నాయి.