భారత్ వంటి దేశాలను కొల్లగొట్టి, ఆ సంపదతో ప్రపంచ
సంపన్న దేశాల్లో ఒకటిగా నిలిచిన దేశం బ్రిటన్. ఇప్పుడా దేశం ఆర్థిక సమస్యలతో సతమతం
అవుతోంది. కరోనా, ఆ వెంటనే ఉక్రెయిన్ యుద్ధం… ఇంగ్లండ్ ఆర్థిక వ్యవస్థ వెన్ను
విరిచాయి. ఆ నేపథ్యంలో ఆ దేశపు ప్రధాన నగరాల్లో ఒకటి దివాలా తీసింది.
బ్రిటన్‌లోని రెండో అతి పెద్ద నగరం బర్మింగ్‌హామ్,
తాజాగా దివాలా తీసినట్టు ప్రకటించింది. బర్మింగ్‌హామ్, యూరోపియన్ యూనియన్లోనే అతిపెద్ద
స్థానిక స్వపరిపాలనా సంస్థ. దాని ఆదాయం సుమారు 4.3 బిలియన్ డాలర్లు. ఇప్పుడు
ఆర్థిక పరిస్థితి తారుమారు అవడంతో పైసా పైసా లెక్కపెట్టి ఖర్చు పెట్టుకోవలసిన
పరిస్థితి.
దాదాపు 10 లక్షల మందికి సేవలు అందించే బర్మింగ్‌హామ్
సిటీ కౌన్సిల్ మంగళవారం సెక్షన్ 114 నోటీస్ ఫైల్ చేసింది. లోకల్
గవర్నమెంట్ అసోసియేషన్ అదనపు సాయం అందించాలని సిటీ కౌన్సిలర్లు జాన్ కాటన్,
షెరెన్ థాంప్సన్ కోరారు. 2023-24కు
దాదాపు 109 మిలియన్ డాలర్లు అవసరం ఉంది. తమకు అందాల్సిన 1.25
బిలియన్ డాలర్ల నిధులను కన్జర్వేటివ్ ప్రభుత్వం లాక్కుందని థాంప్సన్
ఆరోపించారు.
ఐటీ సిస్టమ్‌లో సమస్యలు కూడా బర్మింగ్‌హామ్ సిటీ
కౌన్సిల్ ఆర్థిక దుస్థితిని మరింత ఎగదోశాయి. మే నెలలో ఒరాకిల్ ఈపీఆర్ సిస్టమ్‌కు
100 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. తొలుత అంచనా వేసిన దాని కంటే
ఇది దాదాపు నాలుగు రెట్లు అదనం.
పరిస్థితిపై బ్రిటన్
ప్రధాని కార్యాలయం 10 డౌనింగ్ స్ట్రీట్
స్పందించింది. అక్కడి ప్రజల విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. తాము కొంతవరకూ సాయం చేస్తామని
ప్రధానమంత్రి అధికారిక ప్రతినిధి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వాలు కూడా పన్ను
చెల్లింపుదారుల సొమ్ము నుంచి వచ్చే బడ్జెట్‌ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని
సూచించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు