పార్లమెంట్
ప్రత్యేక సమావేశాల తేదీలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల18 నుంచి 22 వరకు
జరిగే ప్రత్యేక సమావేశాలు 18న పాత భవనంలో ప్రారంభం అవుతాయి. అనంతరం కొత్తగా నిర్మించిన
భవనంలో సమావేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
వచ్చే
ఏడాది జరగబోయో సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రత్యేక సమావేశాలకు కేంద్రం
పిలుపునివ్వడంపై ప్రతిపక్షాలు అభ్యంతరాలు
వ్యక్తం చేస్తున్నాయి. అజెండాను స్పష్టం చేయకుండా తేదీలు ఖరారు చేయడం
సరికాదంటున్నారు. సమావేశాల అజెండాను తెలపాలంటూ ప్రధాని మోదీకి , కాంగ్రెస్ అగ్రనేత
సోనియాగాందీ లేఖ రాశారు.
‘‘
పార్లమెంట్ సమావేశాలు జరిపే ముందు ప్రతిపక్షాలతో చర్చలు జరిపే ఆనవాయితీని తుంగలో
తొక్కారని విమర్శించారు.
అదానీ అక్రమాలు, మణిపూర్ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస
మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీలు కులాల వారీగా జనగణన, చైనా ఆక్రమణలు,
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు, మతఘర్షణలపై చర్చించాలని లేఖలో ప్రధానిని
సోనియా కోరారు.
ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలు, దేశం పేరు
మార్చే తీర్మానం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు