జీ-20
భారత్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని మంత్రులకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు.
దిల్లీ వేదికగా జరిగే జీ-20 సదస్సు నిర్వహణ, సమాయత్తతపై మంత్రులకు దిశానిర్దేశం
చేసిన ప్రధాని మోదీ.. విదేశీ ప్రతినిధులతో సంభాషణలు సజావుగా సాగేందుకు యాప్
దోహదపడుతుందని వివరించారు.
సదస్సుకు సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు హాజరయ్యే
ప్రతినిధుల తాలూకా వివరాలు, సమావేశంలో చర్చించబోయే అంశాలు తదితర విషయాలను యాప్ లో
పొందుపరిచారు.
ఈ
యాప్ ఆవిష్కరణతో భారత్ వర్తమాన సాంకేతికత కిర్తీ ఇనుమడించడంతో పాటు దేశం యెక్క నిబద్ధతను
తెలియజేస్తోంది.
ప్రపంచ
వ్యాప్తంగా ఇప్పటికే ఈ యాప్ను 15 వేలమంది డౌన్ లోడ్ చేసుకున్నట్లు కేంద్ర సమాచార,
ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
జీ-20
సభ్యదేశాలకు సంబంధించిన భాషల్లో ఈ యాప్లో సమాచారం అందుబాటులో ఉంటుందని, దీంతో
ప్రతిఒక్కరికీ ఎంతో సహాయకారిగా ఉంటుందని వెల్లడించింది.
సదస్సుకు
హాజరైన ప్రతినిధులు దేశంలో ఒక చోట నుంచి మరో చోటుకి వెళ్లేందుకు అలాగే జీ-20
సమావేశాలు జరిగే వేదికలు వద్దకు వెళ్లేందుకు సాయ పడుతుంది. 24 భాషాల్లో సమాచారం
అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా భాషా పరమైన అడ్డంకులు అధిగమించవచ్చు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు