ప్రధానమంత్రి
నరేంద్రమోదీ భద్రతను పర్యవేక్షించే భద్రతా బృందం(ఎస్పీజీ) డైరెక్టర్ అరుణ్ కుమార్
సిన్హా కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, గురుగ్రామ్‌లోని
ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
అరుణ్ సిన్హా వయస్సు 61
ఏళ్ళు కాగా కొన్ని నెలలు నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.
2016
నుంచి SPG డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అంతకు
ముందు ఆ పొజిషన్ 15 నెలల పాటు ఖాళీగా ఉంది. ఈ ఏడాది మే 30న ఆయన పదవీకాలం ముగియగా,
అంతకు ముందు రోజే ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధాని మోదీ ఉత్తర్వులు జారీ
చేశారు.
కేరళ క్యాడర్ కు చెందిన అరుణ్ కుమార్ సిన్హా, 1987 ఐపీఎస్ బ్యాచ్ అధికారి.
గతంలో
ఆయన కేరళ పోలీసు శాఖలో ఉన్నత హోదాలో సేవలు అందించారు. డీజీపీ ర్యాంకు హోదాలో ప్రత్యేక సేవలు, ట్రాఫిక్ విభాగ చీఫ్ పనిచేశారు.
ప్రత్యేక
భద్రతా బృందం ఎస్పీజీ, 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య ఘటన తర్వాత
ఏర్పాటైంది. 1985 నుంచి ఈ బృందం, ప్రధానులకు మాజీ ప్రధానులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు
భద్రత కల్పిస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రధాని కుటుంబానికి మాత్రమే భద్రత కల్పిస్తోంది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు