చంద్రయాన్-3 ల్యాండర్ చిత్రాన్ని నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన ఉపగ్రహం ఈ ఫొటోను తీసినట్లు
తెలిపింది. జాబిల్లి ఉపరితలంపై ఉన్న చంద్రయాన్ -3 ల్యాండర్ ను నాసాకు చెందిన లూనార్
రికానజెన్స్ ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్ ఫొటో తీసింది. ఆగస్టు 23న ఈ ల్యాండర్
చంద్రుడి దక్షిణ ధ్రువానికి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో దిగింది అని నాసా
తెలిపింది.
ల్యాండర్ దిగిన నాలుగురోజుల తర్వాత ఆగస్టు 27న
ఎల్ఆర్వో ఈ చిత్రాన్ని తీసిందని, జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్ దిగుతున్నప్పుడు
కలిగిన రాపిడి వల్ల తెల్లని వలయం ఏర్పడిందని ఈ చిత్రాల ద్వారా తెలుస్తోంది.
చంద్రుడి 3డీ అనాగ్లిప్ చిత్రాన్ని నిన్న ఇస్రో
విడుదల చేసింది. అందులో విక్రమ్ ల్యాండర్ ఉన్న ప్రాంతంలో చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది.
రోవర్
అమర్చిన నేవిగేషన్ కెమెరాలతో తీసిన ఫొటోలను ప్రత్యేక పద్ధతిలో వడపోసి ఈ చిత్రాన్ని
రూపొందించినట్లు ఇస్రో పేర్కొంది.
స్టీరియో లేదా మల్టీ వ్యూ ఇమేజ్ లను ఒకచోట
చేర్చి అవి మూడు కోణాల్లో కనిపించేలా చేయడమే అనాగ్లిఫ్, ప్రస్తుతం నిద్రాణంలో ఉన్న
ల్యాండర్, రోవర్ సెప్టెంబర్ 22న తిరిగి మేల్కోనే అవకాశం ఉందని ఇస్రో భావిస్తోంది.