సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా దోమలతో పోల్చుతూ వాటిని నిర్మూలించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై కేసు నమోదైంది. ఉదయనిధి స్టాలిన్‌తోపాటు, ఆయన వ్యాఖ్యలను సమర్థించిన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గేపై కూడా ఉత్తరప్రదేశ్‌లో కేసు నమోదైంది.
మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయంటూ హర్ష గుప్తా, రామ్‌సింగ్ లోధి అనే ఇద్దరు న్యాయవాదులు యూపీలోని రాంపూర్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదే వివాదంపై బెంగళూరు సౌత్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేశ్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు