ప్రపంచ దేశాలకు మింగుడుపడకుండా తయారైన క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు అన్ని దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.అన్ని దేశాల సహకారం లేకుండా వీటిని నియంత్రించడం సాధ్యం కాదని ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె స్పష్టం చేశారు.
క్రిప్టో ఆస్తులను నిర్వహించడానికి ఒక వ్యవస్థ ఉండాలని, ఇదే విషయాన్ని త్వరలో జరగనున్న జీ20 సమావేశాల్లో కూడా చర్చించనున్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు.
క్రిప్టో కరెన్సీ వ్యాపారానికి కూడా మనీలాండరింగ్ చట్టాలు వర్తిస్తాయని గత మార్చిలో ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్చువల్ డిజిటల్ ఆస్తులు, ఫియట్ కరెన్సీల మధ్య మార్పిడి, ఒకటి, అంతకంటే ఎక్కువ వర్చువల్ డిజిటల్ ఆస్తుల మధ్య మార్పిడి, బదిలీ అంశాలు మనీలాండరింగ్ చట్టాల పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
క్రిప్టో కరెన్సీ వినియోగాన్ని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. క్రిప్టో కరెన్సీ నియంత్రణకు దేశంలో ఎలాంటి చట్టాలు చేయలేదు. ఇవి బురిడీ కొట్టించే పథకాలతో సమానంగా ఉన్నాయని, వెంటనే నిషేధించాలని ఆర్బీఐ హెచ్చరించింది.
క్రిప్టో కరెన్సీలను నియంత్రించేందుకు జీ20 దేశాల సదస్సుకు అతిధ్యం ఇస్తోన్న భారత్, ఐఎంఎఫ్, అమెరికా అనుమతి కూడా ఇప్పటికే తీసుకుంది. క్రిప్టో కరెన్సీల నియంత్రణపై జీ20 దేశాలు ఉమ్మడి వ్యవస్థను రూపొందించేందుకు ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తుచేశారు. గత ఫిబ్రవరిలో అమెరికా ట్రజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్తో క్రిప్టో ఆస్తుల నియంత్రణపై చర్చించినట్టు ఆమె తెలిపారు. బిట్కాయిన్లాంటి క్రిప్టో కరెన్సీల ద్వారా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేయాలని నిర్మలా పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు