విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం రాజగోపురానికి మరోసారి బంగారు పూత వేయించాలని పాలకమండలి నిర్ణయించింది. గురువారంనాడు దేవాలయ రాజగోపుర కలశాలను తొలగించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాజగోపురంపై యంత్రాన్ని అలాగే ఉంచి, కేవలం కలశాలను మాత్రమే తొలగించాలని నిర్ణయించారు. పాత కలశాల స్థానంలో బంగారు పూత వేసిన కొత్త కలశాలను అమర్చనున్నారు.
దుర్గామల్లేశ్వరస్వామి ప్రధాన దేవాలయ రాజగోపురంపై తొమ్మిది కలశాలకు బంగారు పూత వేయించేందుకు ఇప్పటికే దాతల నుంచి రూ.45 లక్షల విరాళాలు సేకరించారు. నానో టెక్నాలజీతో కలశాలకు పూత వేయిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే గతంలోనూ కలశాలకు బంగారు పూత వేయించారు. నాలుగేళ్లలో అవి వెలసిపోయి నల్లగా మారాయి. తాజాగా మరోసారి బంగారు పూత వేయించాలనే నిర్ణయంపై భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు