నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భారత్ మాతాజీ జై అంటూ ఎక్స్‌లో పోస్టు చేయడం వైరల్‌గా మారింది. ఇండియా పేరును భారత్‌గా సంబోధించడం మొదలు పెట్టిన తరవాత అమితాబ్ ఈ ట్వీట్ చేయడం చర్చకు దారితీసింది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భారత్ పేరు మాత్రమే ఉండేలా ప్రత్యేక బిల్లు తీసుకురాబోతున్నారనే ఊహాగానాల నేపధ్యంలో అమితాబ్ చేసిన ట్వీట్ వార్తల్లో నిలిచింది.
ఇండియా పేరు మార్పు వివాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు, జయ్ షా స్పందించారు. ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్, బుమ్రా, జడ్డూలను ఉత్సాహపరిచే సమయంలో మన హృదయాల్లో భారత్ ఉండాలని కోరుకుంటున్నట్టు జయ్ షా ట్వీట్ చేశారు. ఆటగాళ్లు భారత్ పేరున్న జెర్సీని ధరిస్తారన్నారు. టీం ఇండియా కాదని, టీం భారత్ అంటూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
టీమిండియా కాదు. టీమ్ భారత్ అంటూ వరల్డ్ కప్ టీమ్‌పై మాజీ క్రికెటర్ సెహ్వాగ్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఇండియా పేరును శాశ్వతంగా భారత్‌గా మార్చబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో సెహ్వాగ్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు