సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం అనేది ఒక మతం కాదని, అదొక జీవన విధానం అంటూ కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సనాతన ధర్మాన్ని మతాలకు, కులాలకు ఆపాదించడం వల్ల సమాజంలో అలజడులు చెలరేగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా దోమల లాంటిదని వాటిని నిర్మూలించాలంటూ విమర్శలు చేయడం మంచిది కాదంటూ కరుణాకర్‌రెడ్డి హెచ్చరించారు.
ఇవాళ జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. యువతలో భక్తిభావాలు పెంచేందుకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యార్ధులకు ఉచితంగా భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి 26 వరకు జరగనున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు