బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన కుమార్తె సుహానా ఖాన్, భార్య గౌరీ ఖాన్, నటి నయనతార సహా ఇవాళ శ్రీవారి సుప్రభాత సేవలో
పాల్గొన్నారు. టీటీడీ అధికారులు షారుఖ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అనంతరం షారుఖ్ తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ నెల 7న షారుఖ్ నటించిన భారీ బడ్జెట్ మూవీ జవాన్ విడదల కానుంది. ఈ నేపధ్యంలో షారుఖ్ ఖాన్ స్వామి వారిని దర్శించుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీవారి దర్శనం తరవాత రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందించారు. గత వారం షారుఖ్ జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణో దేవి ఆలయ దర్శనం చేసుకున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు