అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ కోవిడ్ భారిన పడ్డారు. అగ్రరాజ్య మొదటి మహిళ జిల్ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. ఆమెకు కోవిడ్ స్వల్ప లక్షణాలున్నట్టు గుర్తించారు. జిల్ బైడెన్ ప్రస్తుతం డెలావెర్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్టు శ్వేతసౌధం ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
జిల్ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్ అని తెలియగానే, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కూడా పరీక్షలు నిర్వహించారు. ఆయనకు నెగటివ్ వచ్చినట్టు నిర్థారణ అయిందని తెలిపారు.
గత వారం బైడెన్ దంపతులు ఫ్లోరిడాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తరవాత పిలడెల్ఫియాలోని డెలావర్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి బైడెన్ వైట్‌హౌస్‌కు చేరుకున్నాడు. జిల్ మాత్రం డెలావర్‌లో ఉండిపోయారు. ఆమె అనారోగ్యానికి గురికావడంతో
కోవిడ్ టెస్ట్ నిర్వహించారు. పాజిటివ్ అని తేలింది.
ఈ నెల 9,10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ హాజరు కావాల్సి ఉంది. గురువారం నాటికే బైడెన్ ఢిల్లీ ప్రయాణమవుతారని అగ్రరాజ్యం ప్రకటించింది. ఈ సమయంలో జిల్ బైడెన్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో బైడెన్ ఢిల్లీ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే బైడెన్ జీ20 సమావేశాలకు హాజరవుతారా లేదా అనే విషయంపై వైట్‌హౌస్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు