భారత్ నేపాల్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌కు పలుమార్లు వరుణుడు అంతరాయం కలిగించినా చివరకు ఫలితం తేలింది. ఇప్పటికే పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలలేదు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా వర్షం కారణంగా అంతరాయాలు ఏర్పడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు 230 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ను కుదించారు. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యం విధించారు. బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన 20.1 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా విజయం సాధించింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ 59 బంతుల్లో 74, శుభ్‌మన్ 62 బంతుల్లో 67 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేపట్టిన నేపాల్ టీం, భారత జట్టు
ఫీల్డింగ్ వైఫల్యాలను అనువుగా మలచుకుని 49 ఓవర్లలో 230 పరుగులు చేసింది. నేపాల్ జట్టులో ఓపెనర్లు ఆసిఫ్ షేక్ 97 బంతుల్లో 58 పరుగులు, కుశాల్ బుర్టేల్ 38, సోంపాల్ 48 పరుగులతో రాణించారు.
రోహిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది. గ్రూప్ ఎ నుంచి పాకిస్థాన్ సూపర్ 4కు చేరింది. భారత్ రెండో బెర్తు సొంతం చేసుకుంది. నేపాల్ రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయి టోర్నీ నుంచి ఇంటిదారిపట్టింది.
ఇప్పటికే భారత్ పాక్ మధ్య మ్యాచ్ వర్షార్పణం అయింది. అయితే భారత్ పాక్‌లు మరోసారి తలపడబోతున్నాయి. రెండు జట్లూ గ్రూపు ఎ నుంచి సూపర్ 4కు అర్హత సాధించాయి. సూపర్ 4లో ప్రతి జట్టూ మిగతా మూడు జట్లతో తలపడతాయి. వచ్చే ఆదివారం భారత్ పాక్ జట్ల మధ్య పోరు ఉంటుంది. ఫైనల్‌కు అర్హత సాధిస్తే, దాయాది జట్ల మధ్య మరో మ్యాచ్ వీక్షించవచ్చు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు