ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుంచి యూపీఐ ఇంటర్ ఆపరేబిలిటీ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ రూపీ చెల్లింపులు చేయవచ్చు. ఎస్బిఐ ఇ- యాప్ వాడుతున్న వారు యూపీఐ స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చని బ్యాంకు అధికారులు ప్రకటించారు.
ఇప్పటికే హెచ్డీఎఫ్సీ, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. తాజాగా ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు ఎస్బిఐ కూడా ఇ- రూపీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే క్యూ ఆర్ కోడ్ ఉపయోగిస్తున్న వారు డిజిటల్ రూపీని వినియోగించుకోవచ్చు.
డిజిటల్ కరెన్సీ ఇ-రూపీని ఆర్బిఐ గతేడాది ఫైలట్ ప్రాజెక్టుగా తీసుకువచ్చింది. ముందుగా వ్యాపారులకు, తరవాత సామాన్య వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఫైలట్ ప్రాజెక్టు చేపట్టారు. ఇప్పటికే అరడజనుకుపైగా బ్యాంకులు ఇ-రూపీని అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఎంపిక చేసిన కస్టమర్ల ద్వారా ఈ ఫైలెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు