ఆసియా కప్ టోర్నమెంట్లో భాగంగా భారతదేశం నేపాల్
మధ్య మ్యాచ్ మొదలైంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
తొలుత టాస్ గెలిచిన భారతజట్టు బౌలింగ్ ఎంచుకుంది.
భారత జట్టు ఆడుతున్న రెండవ మ్యాచ్ ఇది. మొదటి
మ్యాచ్, దాయాది పాకిస్తాన్‌తో జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ తన ఇన్నింగ్స్ పూర్తి
చేయగలిగినా, వర్షం కారణంగా పాకిస్తాన్ అసలు బ్యాటింగే మొదలుపెట్టలేకపోయింది.
ఫలితంగా ఆ మ్యాచ్ రద్దయింది. భారత్, పాకిస్తాన్ జట్లకు చెరొక పాయింట్ లభించింది.
అంతకు ముందు నేపాల్‌తో మ్యాచ్ ఆడి గెలిచిన
పాకిస్తాన్, మూడు పాయింట్లతో సూపర్ 4 లోకి చేరుకుంది. ఇవాళ నేపాల్ భారత్‌తో
ఆడుతోంది. భారత్ నేపాల్ మధ్య ఇదే మొట్టమొదటి ఇంటర్నేషనల్ మ్యాచ్.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు