చంద్రయాన్
-3కి చెందిన విక్రమ్ ల్యాండర్ నిర్దేశించిన లక్ష్యాలను మించి పనిచేస్తోందని ఇస్రో
వెల్లడించింది. ల్యాండర్ తాజా ప్రయోగాలకు
ల్యాండర్ విజయవంతంగా స్పందించిందని ఇస్రో తెలిపింది.
తాము
ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ల్యాండర్ తన ఇంజిన్లను మండించిందని, అనుకున్నవిధంగా
పైకి లేచి మళ్లీ జాబిల్లిపై దిగిందని ఇస్రో వెల్లడించింది. 40 సెంటీమీటర్లు
గాల్లోకి లేచి 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా ల్యాండ్ అయిందని పేర్కొంది.
దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
బెంగళూరులోని
కమాండ్ కంట్రోల్ నుంచి ఆదేశాలు అందుకున్న విక్రమ్ తన ఇంజన్లను మండించి పైకి ఎగిరి
సురక్షితంగా దిగింది. భవిష్యత్తులో చంద్రుడి నుంచి వస్తువులు తీసుకురావడంతో పాటు
మానవ సహిత ప్రయోగాలకు ఉపయోగపడనుంది. తాజాగా నిర్వహించిన ప్రయోగం తర్వాత విక్రమ్
ల్యాండర్ లోని అన్ని పేలోడ్లు సురక్షితంగా, భద్రంగా ఉన్నాయని తెలిపింది.
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా జాబిల్లి దక్షిణ
ద్రువంపై పరిశోధనలు చేసి విలువైన సమాచారాన్ని అందించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లు నిద్రాణ స్థితిలో ఉన్నాయి. అక్కడ రాత్రి
సమయం కావడందో వాటిన స్లీప్ మోడ్ లో ఉంచాల్సి వచ్చింది.
చంద్రుడిపై
రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్
డిగ్రీలోకి వెళతాయి.
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ సౌరశక్తి ద్వారా మాత్రమే
పనిచేస్తాయి. రాత్రి సమయంలో సౌరశక్తి అందదు కాబట్టి
వ్యోమనౌక దిగిన శివశక్తి
పాయింట్ దగ్గర తగ్గుతుండటంతో వాటిని
నిద్రాణస్థితిలోకి పంపారు.
14 రోజుల తర్వాత మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను
తట్టుకుని విక్రమ్, ప్రజ్ఞాన్ పనిచేస్తే
అది అద్భుతం అవుతుందని
శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల 22న శివశక్తి పాయింట్
దగ్గర సూర్యోదయం అవుతుంది.