మాజీమంత్రి
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్
భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్
పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. సీబీఐ కోర్టు బెయిలును తిరస్కరించడాన్ని
సవాలు చేస్తూ భాస్కర్ రెడ్డి, మరో సహనిందితుడు ఉదయ్‌కుమార్ రెడ్డిలు తెలంగాణ
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
గత నెల 24న ఉన్నత న్యాయస్థానం వాదనలు ముగించి
తీర్పును రిజర్వు చేసింది.
తాజాగా
వారిద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి, మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ
అధికారులు, ఈ ఏడాది ఏప్రిల్ 16న వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
పులివెందులలోని భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్ళి అరెస్టు చేశారు. అంతకుముందే
గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ
జైలుకు తరలించారు. ః
దీంతో బెయిల్ కోసం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ విడివిడిగా
బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అప్పీల్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం
విచారించింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ వినతిని తిరస్కరించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు