భారత
అంతరిక్ష సంస్థ ప్రయోగాల సమయంలో 3,2,1 అంటూ కౌంట్‌డౌన్ విధులు నిర్వహించే
శాస్త్రవేత్త వలార్మతి గుండెపోటుతో మృతి చెందారు.
చంద్రయాన్-3
సహా ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాల్లో ఆమె తన కంఠంతో కౌంట్‌డౌన్ విధులు నిర్వహించారు.
ప్రత్యేక స్వరంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
తమిళనాడులోని
ఆరియలూర్ లో 1959 జులై 31న జన్మించిన వలార్మతి, కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి
చేశారు.
అంతరిక్ష
పరిశోధన రంగంపై ఆసక్తితో 1984లో ఇస్రో లో
చేరి పలు కీలక హోదాల్లో సేవలు అందించారు. రిశాట్-1కు ప్రాజెక్టు డైరక్టర్ గా
పనిచేశారు.
పరిశోధనరంగంలో ఆమె పనితీరుకు గాను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గౌరవార్థం
ఏర్పాటు చేసిన పురస్కారాన్ని మొదటిసారిగా 2015లో ఈమె అందుకున్నారు.
వలార్మతి
ఇకలేరన్న వార్తను ఇస్రో మాజీ డైరక్టర్ డాక్టర్ పీవీ వెంకటక్రిష్ణన్ సోషల్ మీడియా
ద్వారా వెల్లడించారు. భవిష్యత్ లో ఇస్రో చేపట్టే ప్రయోగాలకు వలార్మతి, వాయిస్
కౌంట్ డౌన్ చెప్పలేరంటూ బాధతో ఆమె చనిపోయిన వార్తను తెలిపారు.
చంద్రయాన్
-3 సందర్భంగా ఆమె చివరిసారిగా తన కంఠంతో
కౌంట్ డౌన్ చెప్పారు. ఆమె ఆకస్మిక మరణానికి చింతిస్తున్నట్లు పలువురు ఇస్రో
సిబ్బంది, ప్రముఖులు తెలిపారు.