తమిళనాడులో అరాచకం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దుండగులు దారుణంగా హతమార్చారు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా పల్లడానికి చెందిన బీజేపీ నాయకుడు మోహన్ రాజ్ కుటుంబాన్ని ఆదివారం రాత్రి నరికి చంపారు. బీజేపీ నాయకుడి ఇంటి ముందు కొందరు మద్యం సేవిస్తుండగా అక్కడ నుంచి వెళ్లిపోవాలని మోహన్ రాజ్ సూచించడంతో వివాదం రాజుకుందని తెలుస్తోంది. తన ఇంటి ముందు మద్యం సేవించవద్దన్నందుకే మోహన్ రాజ్ కుటుంబం మొత్తాన్ని దుండగులు దారుణంగా చంపినట్టు పోలీసుల కథనం ద్వారా తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ హత్యల వెనుక రాజకీయ కోణం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కొంత కాలంగా మోహన్ రాజ్ మద్యపాన వ్యతిరేక ఉద్యమం చేస్తున్నారు. వ్యాపారం తగ్గిపోవడంతో మద్యం మాఫియానే మోహన్ రాజ్ హత్యకు కుట్ర పన్ని ఉంటుందనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు