ఈ వారంలో ఢిల్లీలో జరగనున్న జీ20 సమావేశాలకు హాజరుకావడం లేదంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తీసుకున్న నిర్ణయం తనను చాలా నిరాశ పరిచిందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. చైనా ప్రతినిధిగా ప్రీమియర్ లి కియాంగ్‌ను పంపాలని జిన్‌పింగ్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ‘‘ చైనా అధ్యక్షుడు నిర్ణయం విన్నాక నేను చాలా నిరుత్సాహానికి గురయ్యాను, కానీ నేను ఆయనను కలిసేందుకు వెళుతున్నాను’’ అంటూ మీడియాకు చెప్పారు. ఈ నెల 7 నుంచి 10 వరకు ఢిల్లీలో జీ20 సమావేశాలు జరగనున్నాయి.
జీ20 సమావేశాలకు హాజరవుతున్నట్టు గతంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. అయితే గురువారం చైనా విదేశాంగ శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోయారు. భారత్ చైనా సరిహద్దు సమస్యల నేపథ్యంలో జిన్‌పింగ్ నిర్ణయం ఇబ్బందికరంగా తయారయ్యే అవకాశం ఉంది. చైనా తాజాగా విడుదల చేసిన మ్యాప్ కూడా వివాదానికి దారితీసింది. ఇలాంటి సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ జీ20 సమావేశాలకు హాజరుకాకపోవడం ఇరు దేశాల సంబంధాలపై పలు ఊహాగానాలకు తెరతీసింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు