స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులతో ఆసియా మార్కెట్లు, దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 227 పాయింట్ల లాభంతో 65614 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 80 పాయింట్లు లాభపడి నిఫ్టీ 19515 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 30లో ఎల్ అండ్ టీ, టెక్ మహీంద్రా, మారుతీ, హెచ్సిఎల్ టెక్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, జెఎస్డబ్ల్యూ, కోటక్ మహీంద్రా, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిల్టెల్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ 82.75 వద్ద కొనసాగుతోంది.
ఆసియా మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కావడం, చైనాలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందనే అంచనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ సూచీలు లాభాల బాట పట్టాయి. చైనాలో ఎవర్ గ్రాండ్, కంట్రీ గార్డెన్లాంటి రియల్ ఎస్టేట్ సంస్థల షేర్లు ఒకేసారి 8 శాతం పెరిగాయి. మరోవైపు ఈ వారం నాలుగు ఐపీవోలు ప్రారంభం కానున్నాయి.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు