ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాక రష్యా నుంచి పెద్ద ఎత్తున భారత్ క్రూడాయిల్ దిగుమతులు ప్రారంభించింది. అయితే అనూహ్యంగా గడచిన మూడు నెలలుగా రష్యా క్రూడ్ దిగుమతులు గణనీయంగా తగ్గాయి. క్రూడ్ దిగుమతులు ఆగష్టులో ఏడు నెలల కనిష్ఠానికి తగ్గాయి. గత నెలలో రోజుకు 1.91 మిలియన్ బ్యారెళ్లు దిగుమతి చేసుకోగా, ప్రస్తుతం రోజుకు 1.46 మిలియన్ బ్యారెళ్లు మాత్రమే దిగుమతి చేసుకుంటోంది.
భారత చమురు కంపెనీలు సౌదీ నుంచి క్రూడ్ దిగుమతులు పెంచుకున్నాయి. జులైలో సౌదీ నుంచి రోజుకు 4.84 లక్షల బ్యారెళ్లు రాగా, ప్రస్తుతం రోజుకు 8.20 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. అయితే ఇరాక్ నుంచి దిగుమతులు గణనీయంగా తగ్గాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపధ్యంలో రష్యా తక్కువ ధరకే చములు అమ్మడం మొదలు పెట్టింది. దేశ ఆర్థిక ప్రయోజనాల రీత్యా భారత్ రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంది. వేసవి చివరి వరకు రోజు 20 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకున్నారు. వర్షాకాలం డిమాండ్ తగ్గడం, చమురు శుద్ధి కంపెనీలు వార్షిక మరమ్మతులు చేపట్టడంతో దిగుమతులు తగ్గాయని అంచనా వేస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు