డీఎంకే
అధినేత, తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మాన్నితప్పుబట్టడంపై
కేంద్రహోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. I.N.D.I.A లోని భాగస్వాములు హిందూ విద్వేషులని, దేశ వారసత్వం పై దాడి
చేస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల
ప్రచార కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్ లో పర్యటిస్తున్న కేంద్రహోంమంత్రి అమిత్ షా,
దుంగ్రాపూర్ లో బీజేపీ పరివర్తన యాత్రను ప్రారంభించారు. పాలక కాంగ్రెస్ పార్టీని
ఓడించి అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ అగ్రనేతలు ఆ రాష్ట్రంలో తరచుగా
పర్యటిస్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకని కాంగ్రెస్, దాని
మిత్రపక్షాల తీరును ఎండగడుతున్నారు.
కాంగ్రెస్
పార్టీ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగానే ఆపార్టీ మిత్రపక్షాలు
హిందుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ అగ్రనేత
రాహుల్ గాంధీ 2010లో చేసిన వ్యాఖ్యలను కూడా అమిత్ షా ఉటంకించారు.
లక్షరే
తోయిబా కంటే హిందూ అతివాదులే ప్రమాదకరమని రాహుల్ గతంలో మాట్లాడారని, అప్పటి
హోంమంత్రి కూడా దేశానికి హిందూ తీవ్రవాదుల నుంచి ప్రమాదం పొంచిఉందని ప్రకటించారని
ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెన్నై
లో నిర్వహించిన రచయితల సదస్సులో పాల్గొన్న మంత్రి ఉదయనిధి స్టాలిన్, సామాజిక
న్యాయానికి సనాతన ధర్మ వ్యతిరేకమని దానిని సమాజం నుంచి పూర్తిగా
తుడిచివేయాలన్నారు. మలేరియా, డెంగ్యూ రోగాల లాగే దానిని కూడా నిర్మూలించాలని
వ్యాఖ్యానించారు.
ఉదయనిధి
వ్యాఖ్యలను తప్పుబట్టిన బీజేపీ నేతలు, ఇండియా కూటమిలోని పార్టీలు కూడా ఇదే
అభిప్రాయంతో ఉన్నాయా అని ప్రశ్నించారు.
సనాతన ధర్మంపై మంత్రి ఉదయనిధి వ్యాఖ్యలను
కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు సమర్థిస్తున్నాయో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు
తన
వ్యాఖ్యలపై రేగిన దుమారంపై స్పందించిన ఉదయనిధి, సనాతన ధర్మం అనేది సమాజాన్ని
కులాలు, మతాల పేరుతో విడగొట్టిందన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించేవారిని అంతమొందించాలని మాట్లాడలేదని వివరణ
ఇచ్చారు. వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు
తెలిపిన ఉదయనిధి, సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులుపడిన అణగారిన, వెనకబడిన వర్గాల
తరఫునే మాట్లాడినట్లు చెప్పారు.
ప్రజల
హృదయాలను సనాతన ధర్మం గెలుచుకుందన్న అమిత్ షా, మోదీ విజయం సాధిస్తే సనాతన పాలన
వస్తుందన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి మోదీ పాలన సాగిస్తున్నారన్నారు.
రాముడి
జన్మభూమి అయిన అయోధ్యలో మందిర నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, జనవరిలో
ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. ఎన్నో ఏళ్ళపాటు మందిర నిర్మాణాన్ని అడ్డుకున్న కాంగ్రెస్
ఆటలు ఇక ముందు సాగవన్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు