శత
స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకునే సమయానికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా
అవతరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతి, కులవివక్ష,
మతవిద్వేషాలకు అందులో చోటు ఉండదని మోదీ తెలిపారు.
‘‘2047
నాటికి మనదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని, అప్పుడు కుల,మత విద్వేషాలతో
పాటు అవినీతి పూర్తిగా రూపుమాపబడతాయి.’’ అని ఓ ఇంటర్వ్యూలో మోదీ అభిప్రాయం వ్యక్తం
చేశారు.
దిల్లీలో
జరగనున్న జీ-20 సదస్సు గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ప్రపంచం మొత్తం భారత మార్గదర్శకత్వం
కోసం ఎదురు చూస్తోందన్నారు. మన ఆలోచనలతో
పాటు ముందుచూపు ప్రపంచదేశాల భవిష్యత్
ప్రణాళికకు దిశానిర్దేశం చేస్తుందన్నారు.
ప్రపంచ
జీడీపీ కేంద్రీకృత దృక్కోణం, మానవ కేంద్రీకృత దృక్పథంగా మారుతోందన్నారు. ఈ భారీ
పరివర్తనలో భారతదేశం ఆసక్తికరమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు.
భారత్
పట్ల ప్రపంచ దేశాల అభిప్రాయం మారుతోందన్న ప్రధాని, గతంలో ఇండియా పేరు చెబితే
వందకోట్ల మంది ఆకలి కేకలు గుర్తుకొచ్చేవని, నేడు
100 కోట్ల ఆశావహుల మనస్సులు, అందుకు రెట్టింపు నైపుణ్యం కల్గిన చేతులతో కొత్త చరిత్ర లిఖిస్తోందన్నారు.
రాబోయే
కొన్ని దశాబ్దాల పాటు భారత జనాభాలో పనిచేయగల్గిన యువత ఎక్కువగా ఉండటం మనకు కలిసి వచ్చే అవకాశం అన్నారు. మరో
వెయ్యి ఏళ్ళ పాటు అభివృద్ధి గుర్తిండిపోయే విధంగా పునాది వేయడానికి ఇవాళ
భారతీయులకు గొప్ప అవకాశం ఉందన్నారు.
విపక్షాల
ఉచిత పథకాలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, బాధ్యతా రహితమైన, జనాకర్షక పథకాలతో
స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలు మాత్రమే పొందగల్గుతామన్నారు. కానీ దీర్ఘకాలంలో దేశ
ఆర్థికంగా పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.
రష్యా-ఉక్రెయిన్
యుద్ధ నివారణలో భారత పాత్రపై స్పందించిన ప్రధాని, దౌత్యం ద్వారానే సమస్యలు, సంఘర్షణలకు పరిష్కారం లభిస్తుందని ఉద్ఘాటించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు