ఆసియా
కప్‌లో భాగంగా శ్రీలంక క్యాండీలోని పల్లెకేలే క్రికెట్ స్టేడియంలో భారత్,
పాకిస్తాన్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఇరు
జట్లకు చెరో పాయింట్ లభించింది. ఇప్పటికే నేపాల్ జట్టు మీద గెలిచిన పాకిస్తాన్
మూడు పాయింట్లతో నేరుగా సూపర్ 4కు చేరింది.
నేపాల్,
భారత్ మధ్య ఈ నెల4న మ్యాచ్ జరగనుంది. ఈ పోటీలో విజయం సాధిస్తే భారత్ కూడా మొత్తం
మూడు పాయింట్లతో సూపర్ 4కు చేరింది. టాచ్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన
టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌కు రెండుసార్లు
ఆటంకం కల్పించిన వర్షం, ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం కూడా పడింది.
267
పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగాలనుకున్న పాక్ కు వరుణుడు అడ్డొచ్చాడు. దీంతో
సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకుండేనే మ్చాచ్ ను రద్దు చేశారు.
భారత
ఇన్నింగ్స్ లో హార్థిక్ పాండ్య (87, 90 బంతులో 7×4,1×6) ఇషాన్ కిషన్ (82, 81 బంతుల్లో 9×4,2×6) గొప్పగా ఆడారు. పాక్ బౌలర్ షహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్
దాటికి మొదట్లో తడబడ్డ టీమిండియా తర్వాత నిలదొక్కుకుంది.
ఇప్పటికే
నేపాల్ పై నెగ్గిన పాక్.. ఈ మ్యాచ్ రద్దు కావడంతో సూపర్-4కు అర్హత సాధించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు