ఆసియా
కప్ హాకీ ఫైవ్స్ టోర్నమెంట్ లో భారత జట్టు విజయం సాధించడంపై ప్రధాని మోదీ హర్షం
వ్యక్తం చేశారు. ఈ విజయం ఆటగాళ్ళ అచంచలమైన అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. ఈ
విజయంతో వచ్చే ఏడాది ఒమన్ లో జరిగే ప్రపంచ కప్ కు అర్హత సాధించామని.. విజయం కోసం మన జట్టు శ్రమించిన తీరు, సంకల్పం దేశానికి
స్ఫూర్తినిస్తుందని ప్రధాని
అభినందనలు తెలిపారు.
ఆసియా
కప్ ఫైవ్స్ టోర్నమెంట్ లో భారత పురుషుల హాకీ జట్టు విజేతగా నిలిచింది. శనివారం
జరిగిన ఫైనల్లో భారత్ షూటౌట్ లో 2-0తో పాకిస్తాన్ పై గెలిచింది. చాంపియన్ గా
నిలిచిన భారత్ వచ్చే ఏడాది జరిగే హాకీ ఫైవ్స్ ప్రపంచకప్ కు అర్హత సాధించింది.
నిర్ణీత
సమయంలో ఇరు జట్లు గోల్స్ (4-4) తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ
షూటౌట్ అనివార్యమైంది.
అబ్దుల్
రెహ్మాన్(5వ) గోల్ తో పాక్ 1-0తో
నిలిచినా.. వెంటనే పుంజుకున్న భారత్ జుగ్రాజ్ (7వ), మణిందర్ సింగ్(10వ) సఫలం
కావడంతో 2-1 ఆధిక్యంలోకి వెళ్ళింది. ధీటుగా స్పందించిన భారత్, రహీల్(19వ, 26వ)
మెరవడంతో స్కోరు సమం అయింది.
నిర్ణీత
సమయంలో ఇరు జట్లు గోల్ సాధించకపోవడంతో మ్యాచ్ షూటౌట్లో పాక్ తరఫున అర్షద్, ముర్తజా
విఫలం కాగా, గుర్జ్యోత్ సింగ్, మణిందర్ సింగ్ గోల్స్ చేయడంతో భారత్ నెగ్గింది.
వచ్చే ఏడాది జరిగే హాకీ ఫైవ్స్ ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.
విజేతగా నిలిచిన
భారత్ జట్టులోని సభ్యులకు రూ 2 లక్షల చొప్పున, శిక్షణ సహాయక సిబ్బందికి లక్ష
చొప్పున హాకీ ఇండియా నగదు పురస్కారం ప్రకటించింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు