సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని, సామాజిక న్యాయానికి అది విరుద్దమని తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు.
సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగ్యూలాంటిది కావున వీటిని నిర్మూలించాలంటూ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. అతనిపై కేసు పెట్టాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడు డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. దాన్ని కేవలం వ్యతిరేకించడమే కాదు, పూర్తిగా నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతదేశంలో సనాతన ధర్మాని అనుసరిస్తున్న 80 శాతం మందిని నరమేధం చేయాలని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముహబ్బత్ కీ దుకాన్ అంటే ప్రేమ దుకాణం గురించి మాట్లాడుతుంటే, ఇండియా కూటమిలోని డీఎంకే పార్టీ సీఎం స్టాలిన్ వారసుడు మాత్రం సనాతన ధర్మాన్ని రూపుమాపడం గురించి మాట్లాడుతున్నారని బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. ఇండియా కూటమికి అవకాశం ఇస్తే శతాబ్ధాలనాటి భారతదేశపు నాగరికతను నిర్మూలిస్తారని మాల్వియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు