ఏపీలో ఈ ఉదయం చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బాపట్ల జిల్లా గుంటూరు – కర్నూలు ప్రధాన రహదారిపై సంతమాగులూరు వద్ద ఆటోను లారీ ఢీ కొనడంతో అక్కడిక్కడే ఐదుగురు ప్రయాణీకులు చనిపోయారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిని గుంటూరుకు చెందిన వంటవారుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరో ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పొలికి వద్ద రెండు బైక్లు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిని బాలు, వర్ధన్లుగా గుర్తించారు. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు