రాజస్థాన్లో
ఓ వివాహితను ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టి వివస్త్రను చేసిన
ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన
వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ బీజేపీ ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతోంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంలో శాంతి
భద్రతలు దిగజారాయని అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని దుయ్యబట్టింది.
సదరు
ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్.. బాధితురాలి ఇంటికి వెళ్ళి
పరామర్శించారు. ఆమెకు పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఘటనపై
ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపిస్తామని చెప్పారు. అలాగే దారుణానికి
పాల్పడిన 11 మందిని పోలీసులు అరెస్టు చేసినట్లు చెప్పారు. బాధితురాలికి న్యాయం
జరుగుతుందన్నారు. ఆమె పేరిట 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు
ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామన్నారు.
రాజస్థాన్
లోని ప్రతాప్ గఢ్ జిల్లాలో ఓ గిరిజన మహళ, భర్తతో విభేదించి,, మరో వ్యక్తితో ఉంటోంది.
దీంతో ఆగ్రహం చెందిన భర్త, అతని బంధువులు, ఆమె ఉంటున్న నివాసం దగ్గరకు వెళ్ళి
గొడవకు దిగారు. సదరు మహిళను చితకబాది, వివస్త్రను చేసి రోడ్ల వెంబడి తింపారు. మళ్లీ
ఆమె ఉంటున్న ఇంటి దగ్గరే దింపారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు పొక్కడంతో
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటనను అత్యంత సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించిన
రాజిస్థాన్ మహిళా కమిషన్.. కేసు దర్యాప్తును తాము ప్రతిరోజు సమీక్షిస్తామని, బాధితురాలిని పరామర్శించి అండగా ఉంటామని చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పుడే మరొకరు
అలాంటి తప్పు చేసేందుకు జంకుతారని మహిళా కమిషన్ అధ్యక్షురాలు రెహనా రియాజ్
చెప్పారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు