తెలంగాణ
రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం రేపిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని దీప్తి
అనుమానాస్పద మృతి కేసులో అసలు విషయం బయటపడింది. దీప్తి హత్యకు గురైందని తేల్చిన
పోలీసులు తోబుట్టువే దారుణానికి పాల్పడినట్లు వెల్లడించారు.
హతురాలి
సోదరే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. హతురాలి సోదరి చందన
తన ప్రియుడితో కలిసి అత్యంత కర్కశంగా తోబుట్టువు ప్రాణాలు తీసినట్లు
నిర్ధారించారు.
పోలీసులు
తెలిపిన వివరాల ప్రకారం.. దీప్తి చెల్లెలు అయిన బంక చందన 2019లో హైదరాబాద్ లోని ఓ
కాలేజీలో ఇంజినీరింగ్ కోర్సులో జాయిన్ అయ్యారు. రెండేళ్ళ తర్వాత డిటెయిన్ అయ్యారు.
చందన తనతో పాటు చదివిన హైదరాబాద్ కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ చందనకు
పరిచయమయ్యారు. పరిచయం కాస్తా కొద్ది కాలంలోనే ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరు
పెళ్ళి చేసుకోవాలనుకున్నారు.
ఇద్దరు
జీవితంలో స్థిరపడకపోవడంతో పెళ్ళి తర్వాత జీవనాధారం కోసం డబ్బు అవసరమని ఉమర్ చందనకు
చెప్పాడు. కొద్ది రోజుల క్రితం ఉమర్‌కు ఫోన్ చేసిన చందన, ఇంట్లో అక్కా తాను
మాత్రమే ఉన్నామని, కోరుట్ల రమ్మని పిలిచింది. దీంతో ఉమర్ ఆగస్టు 28న కోరుట్లకు
వచ్చాడు.
ముందస్తు
పథకం ప్రకారం.. దీప్తి కోసం వోడ్కా, బ్రీజర్ తెప్పించింది. సోమవారం రాత్రి తండ్రి
శ్రీనివాసరెడ్డితో ఫోన్ లో మాట్లాడిన తర్వాత అక్కతో కలిసి వోడ్కా తాగి పడుకుంది.
దీప్తి
నిద్రపోయిన తర్వాత, ఉమర్ కు చందన ఫోన్ చేసింది. చందన, ఉమర్ కలిసి ఇంట్లోని నగదు,
బంగారాన్ని తీస్తుండగా దీప్తి చూసి కేకలు వేసింది. దీప్తి మెడకు చున్నీ చుట్టి
వెనక్కి లాగారు. అయినా కేకలు వేస్తుండటంతో ఉమర్, చందన గట్టిగా పట్టుకుని దీప్తి
ముఖానికి చున్నీ చుట్టి మూతి, ముక్కుకు ప్లాస్టర్ వేశారు.
10
నిమిషాల తర్వాత ఆమెలో చలనం లేదు. ఇంట్లో ఉన్న రూ.1.20 లక్షల నగదు, 70 తులాల బంగారం
తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు దీప్తి మూతికి చుట్టిన ప్లాస్టర్
తీసి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
అనంతరం హైదరాబాద్ వెళ్ళారు. నాగ్‌పూర్
వెళ్ళి స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆర్మూర్ దగ్గర పోలీసులు ఇరువురిని
అదుపులోకి తీసుకున్నారు.
కేసులో
ఏ1 చందన, ఏ2 ఉమర్ షేక్ సుల్తాన్, అతని తల్లి సయ్యద్ అలియా, షేక్ అసియా ఫాతిమా
హాఫీజ్ ను అరెస్టు చేశారు.
ఇరువురి
మతాలు వేరు కావడంతో పాటు ఎలాంటి ఉద్యోగం లేకుండా ఆకతాయిగా తిరుగుతుండటంతో దీప్తికి
వారి వ్యవహారం నచ్చేది కాదట. అతనితో చనువుగా ఉండటంపై చందనపై కోపంగా ఉండేదని కూడా పలువురు
చెబుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు