కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈఓ, ఎండీ ఉదయ్ కోటక్ తన
పదవికి రాజీనామా చేసారు. ఆ మేరకు తన రాజీనామా లేఖను బ్యాంక్ బోర్డ్ ఆఫ్
డైరెక్టర్స్ చైర్మన్ ప్రకాష్ ఆప్టేకు పంపించారు.
నిజానికి తన పదవీకాలం మరికొన్ని నెలలు
ఉన్నప్పటికీ తక్షణమే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఉదయ్ కోటక్ ఆ లేఖలో
పేర్కొన్నారు. ‘‘రాజీనామా నిర్ణయం గురించి కొంతకాలంగా మల్లగుల్లాలు పడుతున్నాను. తక్షణం
రాజీనామా చేయడమే సరైన పని అని నమ్ముతున్నాను’’ అని ఉదయ్ రాసారు.
‘‘బ్యాంకులో నా తర్వాతి ఎవరు అన్నదే నాకు వచ్చిన
మొదటి ఆలోచన. ఈ సంవత్సరాంతంలో మన చైర్మన్, నేను, జాయింట్ ఎండీ అందరమూ దిగిపోవాలి.
ఈ విరమణలను ఒక వరుసక్రమంలోకి తీసుకురావడం ద్వారా వ్యవహారం సజావుగా జరిగిపోయేలా
చూడడం మీదనే నా ధ్యాసంతా. ఆ ప్రక్రియని నాతోనే మొదలుపెడుతున్నాను. స్వచ్ఛందంగా
సీఈఓ పదవి నుంచి తక్షణమే వైదొలగుతున్నాను’’ అని ఉదయ్ వివరించారు.
ప్రస్తుతం జాయింట్ ఎండీగా ఉన్న దీపక్ గుప్తా, ఉదయ్
స్థానంలో తాత్కాలికంగా ఎండీ, సీఈఓ బాధ్యతలు నిర్వహిస్తారు.
‘‘సంస్థ వ్యవస్థాపకుడిగా, కోటక్ బ్రాండ్‌తో నాకు
ఎనలేని అనుబంధం ఉంది. బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, షేర్ హోల్డర్‌గా
సంస్థకు నా సేవలు అందిస్తూనే ఉంటాను. ఈ వారసత్వాన్ని కొనసాగించడానికి మనకు
అద్భుతమైన మేనేజ్మెంట్ టీమ్ ఉంది. వ్యవస్థాపకులు వెళ్ళిపోవచ్చు, కానీ సంస్థ
శాశ్వతంగా రాణిస్తుంది’’ అని ఉదయ్ కోటక్ చెప్పుకొచ్చారు.
కోటక్ మహీంద్రా బ్యాంకులో
ఉదయ్ కోటక్ 38 సంవత్సరాలు పనిచేసారు. పలురకాల ఆర్థిక సేవలు అందించే సంస్థగా కోటక్
మహీంద్రాను తీర్చిదిద్దడంలో ఉదయ్ కీలక పాత్ర పోషించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు