చంద్రుడిపై
చంద్రయాన్-3 అన్వేషణకు సంబంధించి ప్రజ్ఞాన్ రోవర్ రోజుకో కొత్త విషయాన్ని
వెలుగులోకి తెస్తోంది.
ఉపరితలంపై
ప్రజ్ఞాన్ రోవర్ సరికొత్త రికార్డును సృష్టించింది. ల్యాండర్ అడుగుమోపిన శివశక్తి
పాయింట్ నుంచి ఇప్పటి వరకు ప్రజ్ఞాన్ రోవర్
వంద మీటర్ల దూరం ప్రయాణించింది. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతోంది. ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసిన ఇస్రో.. ప్రజ్ఞాన్ సెంచరీ నాట్ ఔట్ అంటూ సరదాగా
రాసుకొచ్చింది.
చంద్రయాన్
-3 విజయంతో అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాలు రాబట్టామని ఇస్రో చైర్మన్ సోమనాథ్
అన్నారు. విక్రమ్, ప్రజ్ఞాన్ ప్రస్తుతం అంచనాకు అనుగుణంగానే స్పందిస్తున్నాయని,
వాటిలోని పేలోడ్లు జాబిల్లిపై విస్తృత పరిశోధనలో నిమగ్నమై ఉన్నట్లు వివరించారు.
చంద్రుడిపై రాత్రి వేళ సమీపిస్తోంది, అందుకే
విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను నిద్ర పుచ్చేందుకు ఇస్రో సన్నాహాలు మొదలు
పెట్టింది. భూమిపై 14 రోజులకు సమానమైన చంద్రుని రోజులో ఒక పగటి పూట పూర్తి కాబోతోంది.
చంద్రుడిపై రాత్రి సమయాన్ని తట్టుకుని నిలవాల్సిన అవసరం ఉంది కాబట్టి, వీటిని
స్లీప్ మోడ్ లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభమ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో
వీటిని స్లీప్ మోడ్ లోకి తీసుకెళ్తారు.
పేలోడ్లు
ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు, గంధకం, వంటి మూలకాల లభ్యత,
ప్రకంపనలు వంటి సమాచారాన్ని అందించాయి.
పాఠ్యాంశంగా
చంద్రయాన్-3..
వచ్చే
విద్యాసంవత్సరం నుంచి చంద్రయాన్-3 విజయాన్ని పాఠ్యాంశంగా రూపొందించేలా చర్యలు
తీసుకుంటున్నట్లు తమిళనాడు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. విద్యాశాఖ మంత్రి
అన్బిల్ మహేశ్ మాట్లాడుతూ .. చంద్రయాన్-3 విజయం ప్రపంచ దేశాల్లో భారత్
కీర్తిప్రతిష్ఠలు ఇనుమడింపజేసిందన్నారు. ఈప్రాజెక్టుకు సారధ్యం వహించిన పలువురు
శాస్త్రవేత్తలు ప్రభుత్వ బడుల్లో చదువుకున్నారని గుర్తు చేశారు. చంద్రయాన్-3 విజయాన్ని
పాఠ్యాంశంగా రూపొందించడంపై విద్యా నిపుణులతో చెప్పారు.