ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో అధికారులు
రక్షించిన చిరుతపులి, ఎటావాలోని లయన్ సఫారీ పార్క్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస
విడిచింది.
అటవీశాఖ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం,
ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ జిల్లా దయాళ్పురా గ్రామం దగ్గర స్థానికులు ఒక చిరుతపులి తీవ్రమైన
గాయాలతో ఉండగా కనుగొన్నారు. గ్రామస్తుల సమాచారంతో అటవీశాఖ అధికారులు ఆ చిరుతను రక్షించారు. దాన్ని
చికిత్స కోసం ఎటావా సఫారీ పార్క్‌కు పంపించారు.
ఎటావా సఫారీ పార్క్ డైరెక్టర్ దీక్షా భండారీ ఆ
చిరుత గురించి చెప్పారు. ‘‘దానికి తల మీద, ముక్కు మీద తీవ్రమైన గాయాలయ్యాయి. మా
సఫారీలోని వైద్యులు దానికి చికిత్స మొదలు పెట్టారు. కానీ ఫలితం లేకపోయింది. ఆగస్ట్
31 రాత్రి సుమారు 9 గంటలకు ఆ చిరుతపులి ప్రాణాలు విడిచింది’’ అని వెల్లడించారు.
మరోవైపు, మధ్యప్రదేశ్‌లో
మరో చిరుతపులి పరిస్థితి కూడా విషమంగా ఉంది. దేవాస్ జిల్లాలో ప్రాణాపాయ
పరిస్థితిలో దొరికిన చిరుతను బుధవారం ఇండోర్ జూపార్క్‌కు చికిత్స కోసం
తీసుకువచ్చారు. పదేళ్ళ వయసున్న ఆ చిరుత ఒంటిమీద ఎలాంటి గాయాలూ లేవు. నడవలేని
స్థితిలో ఉన్న ఆ చిరుతపులితో గ్రామస్తులు ఆడుకున్నారు, సెల్ఫీలు కూడా
తీసుకున్నారు. ఆ చిరుత కండరాల వ్యాధితో బాధపడుతోందని అధికారులు వివరించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు