ఆసియా
కప్ -2023 లో భాగంగా దాయాదుల మధ్య రసవత్తర పోరు ప్రారంభమైంది. భారత్, పాకిస్తాన్
మధ్య శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియంలో ఆట ఆరంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా
కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ ఎంచుకున్నారు.
శ్రీలంకలోని
పల్లెకెలె వేదికగా జరిగే మ్యాచ్లో అమీతుమీ తేల్చుకునేందుకు ఇరుజట్లు సర్వసన్నద్ధంగా
మైదానంలో అడుగుపెట్టాయి.
వాతావరణ
ప్రభావంతో ఈ మ్యాచ్ రద్దు అవుతుందనే ప్రచారం కూడా జరిగింది. నిన్నవర్షం పడటం, ఇవాళ
కూడా ఆకాశం మేఘావృతం అయి ఉండటంతో వాన కురుస్తుందేమోనని క్రికెట్ అభిమానులు ఆందోళన
చెందారు. ఇప్పుడు వర్ష ప్రభావం లేకపోవడం మరో మూడు గంటల తర్వాత కూడా పడే అవకాశం
లేకపోవడంతో 50 ఓవర్ల మ్యాచ్ చూసే అవకాశం ఉంది.
ఒక
వేళ వాన కారణంగా అంతరాయం ఏర్పడితే 20
ఓవర్ల మ్యాచ్, అదికూడా సాధ్యం కాకపోత చెరోపాయింట్ ఇస్తారు.
భారత
తుది జట్టు..
రోహిత్
శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్,
హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ ప్రీత్ బుమ్రా,
మహ్మద్ సిరాజ్.
పాకిస్తాన్
జట్టు..
ఫఖర్
జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్),
సల్మాన్ అలీ ఆఘా, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహిన్ అఫ్రిది,
నసీం షా, హ్యారిస్ రవూఫ్.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు