జెట్
ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. నగదు
అక్రమ లావాదేవీల నిరోధక చట్టం కింద ముంబైలో గతరాత్రి ఆయనను అదుపులోకి తీసుకుని
ప్రశ్నిస్తున్నారు. ముంబై కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ అధికారులు, అటు
నుంచి అటే అదుపులోకి తీసుకున్నారు.
జెట్
ఎయిర్ కోసం కెనరా బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 848.86 కోట్ల రుణాలను దారి మళ్ళించి
స్వాహా చేశారనే ఫిర్యాదు పై సీబీఐ అంతకు
ముందే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
నరేశ్
గోయల్, అనితా గోయల్, గౌరంగ్ ఆనంద శెట్టి తదితరులపై గతేడాది నవంబర్ 11న సీబీఐకి
కెనరా బ్యాంకు చీఫ్ జనరల్ మేనజర్ సంతోష్ ఫిర్యాదు చేశారు. గోయల్ చర్యలతో బ్యాంకుకు
రూ 538.62 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విదేశీ
విమాన సర్వీసుల సంస్థ ఎతిహాద్‌కు వాటాల విక్రయ ఒప్పందం విషయంలో విదేశీ మారకద్రవ్యం
యాజమాన్య సంస్థ నిబంధనను నరేశ్‌గోయల్ ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ముంబై,
దిల్లీలోని ఆయన నివాసాలు, కార్యాలయాలపై 2019 సెప్టెంబర్‌లో తనిఖీలు చేశారు. 2020లో
గోయల్ ని ఈడీ అధికారులు పలు దఫాలుగా ప్రశ్నించారు.
దాదాపు
25 ఏళ్ళ పాటు నిరంతరాయంగా విమాన సేవలు నిర్వహించిన జెట్ ఎయిర్వేస్ తదనంతర కాలంలో
భారీ నష్టాలు చవిచూసింది. సర్వీసుల నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో
విఫలం కావడంతో 2019 ఏప్రిల్ లో మూత పడింది.
బ్యాంకులు నిర్వహించిన జలాన్ కల్రాక్ కన్సార్షియం,
జెట్ ఎయిర్ వేస్ సంస్థ బిడ్‌ను సొంతం చేసుకుంది.
జెట్ ఎయిర్వేస్ సర్వీసులు
నిలిచిపోయాక, 2019 మే 25న విదేశాలకు వెళ్ళేందుకు నరేశ్ గోయల్ ఆయన సతీమణి అనితా
గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి
అనుమతించలేదు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు