తిరుమలలో
కొలువుదీరిన బ్రహ్మాండనాయకుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆపద మొక్కులవాడి
నామస్మరణతో ఏడుకొండలు మార్మోగుతున్నాయి. శ్రీవారి ఆదాయం కూడా కళ్ళు చెదిరే రీతిలో
ఉంటుంది.
ఆగస్టులో
22.25 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే.. హుండీ ద్వారా రూ.120.05 కోట్ల
ఆదాయం వచ్చింది. గత నెలలో 9 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించారు.
తలనీలాలు
సమర్పించిన భక్తుల సంఖ్య 9.07 లక్షలు. వేంకటేశుడి అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు
43.07 లక్షలు అని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ ్
18 నుంచి 26 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 15
నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహంచబోతున్నారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో
సామాన్యులకు పెద్దపీట వేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. త్వరలో
తిరుచానూరులో మహావరుణయాగం ఉంటుందని, అష్ట వినాయక అతిథి గృహంలో గదులను సాధారణ
భక్తులకు కేటాయించడంతోపాటు వికాస్ నిలయాన్ని ఆధునీకరించి భక్తులకు అందుబాటులోకి
తెస్తామన్నారు. శుక్రవారం స్వామివారిని 67,193 మంది దర్శించుకోగా, 28,750 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ
ద్వారా రూ.3.62 కోట్ల కానుకులను భక్తులు సమర్పించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు