భారత
నావికాదళంలోకి మరో యుద్ధనౌక చేరింది. యుద్ధనౌక మహేంద్రగిరి, ఉపరాష్ట్రపతి జగదీప్
ధన్ఖడ్ భార్య సుదేశ్
ధన్ఖడ్
ముంబై తీరంలో జలప్రవేశం చేయించారు. దీనిని 75 శాతం దేశీయంగా మజగావ్ డాక్ షిప్
బిల్డర్స్ తయారు చేసింది.
నావికాదళంలో
మనదేశం సాధించిన పురోగతికి మహేంద్రగిరి నిదర్శనమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు.
సువిశాల సముద్ర జలాల్లో త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతుందని ఆకాంక్షించారు. భారత
త్రివిధ దళాలలో మొత్తం పదివేల మంది మహిళలు దేశం కోసం ప్రాణాలు లెక్కచేయకుండా
పోరాడుతున్నారని, ఇది లింగ సమానత్వాన్ని సూచిస్తోందన్నారు. మహేంద్రగిరి జలప్రవేశం
భారత నావికాదళ చరిత్రలో కీలకమైలురాయిగా నిలుస్తుందన్నారు.
శత్రు దేశ రాడార్లకు చిక్కని సామర్థ్యం కలిగిన
ఏడు యుద్ధనౌకలను తయారు చేయాలని నౌకాదళం ప్రాజెక్టు 17ఎ ప్రారంభించింది. ఈ
ప్రాజెక్టు కింద నిర్మించిన నీలగిరి క్లాస్ యుద్ధనౌకల్లో మహేంద్రగిరి ఏడోది. తొలి
ఆరు నౌకలు 2019-2023 మధ్యకాలంలో జలప్రవేశం చేశాయి.
తూర్పు
కనుమల్లో భాగమైన ఒడిశాలోని మహేంద్రగిరి పర్వతం పేరును ఈ యుద్ధ నౌకకు పేరు
పెట్టారు.
కార్యక్రమంలో నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ . హరికుమార్, మహారాష్ట్ర గవర్నర్
రమేష్ బైస్, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పాల్గొన్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు