చంద్రుడి
దక్షిణ ధ్రువం మీద కాలుపెట్టడానికి భారత్‌తో పాటు రష్యా కూడా ప్రయత్నించి విఫలమైన
సంగతి తెలిసిందే. రష్యా ప్రయోగించిన లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలం
మీద కుప్పకూలిపోయింది. ఆగస్టు 21న లక్ష్యానికి కొద్ది కిలోమీటర్ల ఎత్తులోనే లూనా
క్రాఫ్ట్ విఫలమై పడిపోయింది.
అమెరికా
అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా, చంద్రుడి మీద లూనా పతనమైన స్థలాన్ని గుర్తించింది.
నాసాకు చెందిన వ్యోమనౌక ఆ ప్రాంతాన్ని ఫొటోలు కూడా తీసింది. లూనా కూలిపోయిన చోట
సుమారు 10 మీటర్ల వెడల్పైన గొయ్యి పడిందని కూడా తెలిసింది.
నాసాకు చెందిన లూనార్ రీకన్నోయిజెన్స్
ఆర్బిటర్ వ్యోమనౌక, చంద్రతలం మీద లూనా-25 కూలిన ప్రదేశాన్ని ఫొటోలు తీసింది.
‘‘చందమామ మీద కొత్తగా ఏర్పడిన ఈ బిలం సుమారు 10మీటర్ల వ్యాసంతో ఉంది. లూనా-25 దిగవలసిన
ప్రదేశానికి ఈ గొయ్యి చేరువలో ఉంది. అందువల్ల, లూనా ప్రమాదం వల్లనే ఈ గొయ్యి
ఏర్పడి ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని నాసా ప్రకటించింది.